నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం క్రిస్టియన్ పేట మొదటి లైన్ లో డాక్టర్ కే. భానుప్రకాష్, డాక్టర్ కే. భావన, డాక్టర్ కే. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భాను ఆర్ధో అండ్ చెస్ట్ హాస్పిటల్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి ప్రారంభించారు. పలు బ్లాక్ లను వారు ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, నున్నా మురళి, డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ సుబ్బారావు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..